ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కళా వెంకట్రావును పోలీస్ స్టేషన్​కు లాక్కెళ్లటం అమానుషం'

తెదేపా నేతల అరెస్టులను మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగా ఖండించారు. నోటీసు ఇచ్చేందుకు కళా వెంకట్రావు ఇంటికి వందలాది పోలీసులను పంపిస్తారా అని ప్రశ్నించారు.

yanamala condemns tdp leaders arrests
యనమల రామకృష్ణుడు

By

Published : Jan 21, 2021, 1:55 PM IST

కళా వెంకట్రావు అరెస్టు, తిరుపతిలోని తెదేపా నాయకుల నిర్బంధాన్ని.. మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఖండించారు. నరసింహయాదవ్​పై పోలీసుల దౌర్జన్యం చేయటంపై యనమల మండిపడ్డారు. అజాత శత్రువు కళా వెంకట్రావుపై సెక్షన్ 307 పెట్టడం కన్నా నీఛం మరొకటి లేదంటూ... దుయ్యబట్టారు. మందులు వేసుకోనివ్వకుండా, భోజనం చేయనీయకుండా బలవంతంగా కళా వెంకట్రావును పోలీస్ స్టేషన్​కు లాక్కెళ్లటం అమానుషమని ఆవేదన చెందారు.

'నోటీసు ఇచ్చేందుకు వందలాది పోలీసులను కళా వెంకట్రావు ఇంటికి పంపిస్తారా? విచారణకు స్టేషన్​కు పిలిపించాలంటే.. అంతమందిని పంపించాలా? ఇదేనా మాజీ హోం మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యునిగా, 4 శాఖల మంత్రిగా పని చేసిన నాయకుడి పట్ల మీ ప్రవర్తన?' అని పోలీసులను యనమల నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details