జగన్ నవరత్నాలని డబ్బా కొడుతున్నాడని.. కానీ అవి నవమోసాలని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. నవరత్నాలు ఇస్తానని చెప్పి, నవమోసాలకు పాల్పడిన జగన్ రెడ్డికి ఎప్పుడెప్పుడు బుద్ధి చెప్పాలా.. అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. జగన్ మూడేళ్ల పాలన 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలుగా సాగుతోందన్నారు. నవరత్నాల గురించి మాట్లాడటం, గెలవకపోతే వాటిని నిలిపేస్తారని చెప్పడాన్ని ప్రజలే ఈసడించుకుంటున్నారని యనమల తెలిపారు.
"జగన్ మూడేళ్ల పాలన.. 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలు" - వైకాపా ప్రభుత్వంపై యనమల కామెంట్స్
జగన్ మూడేళ్ల పాలన 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలుగా సాగుతోందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. నవరత్నాలు ఇస్తానని చెప్పి, నవమోసాలకు పాల్పడిన జగన్ రెడ్డికి ఎప్పుడెప్పుడు బుద్ధి చెప్పాలా.. అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు.
జగన్కు బుద్ధి చెప్పేందుకు ప్రజల ఎదురుచూపు
విచ్చలవిడి అప్పులతో ప్రజలకు తిప్పలు, కరెంటు ఛార్జీల భగభగలతో ధరల సెగలు అని యనమల విమర్శించారు. పేదల జీవితాలతో చెలగాటం ఆడి, కొనుగోలు శక్తిని, పొదుపు శక్తిని దెబ్బతీయటంతో పాటు పేదరికం పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి సంక్షేమ పథకాలను కూడా అవినీతి మయం చేశారని వాపోయారు.
ఇదీ చదవండి: Vijayawada Drugs : కొరియర్లో పార్శిల్ పంపారు.. తిరిగి వెనక్కొచ్చింది.. ఓపెన్ చేసి చూస్తే..