ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో అప్పులు అత్యధికం, అభివృద్ధి అత్యల్పం: యనమల

ఏపీలో అప్పులు అత్యధికం, అభివృద్ధి అత్యల్పమని తెదేపా నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అప్పుల భారం ప్రజలకు అని.. పప్పు బెల్లాలు వైకాపా నాయకులని.. ఆయన ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో అప్పులు అత్యధికం, అభివృద్ధి అత్యల్పం: యనమల
రాష్ట్రంలో అప్పులు అత్యధికం, అభివృద్ధి అత్యల్పం: యనమల

By

Published : Jan 3, 2021, 1:19 PM IST

రాష్ట్రం అప్పులపాలైందని యనమల రామకృష్ణుడు విమర్శించారు. 19 నెలల్లో లక్షన్నర కోట్లు అప్పులు చేశారని, ప్రజలపై 75 వేల కోట్ల పన్నులు వేశారని యనమల ఆరోపించారు. నెలకు 4 వేల కోట్ల పన్నుల భారం మోపారన్నారు. ఈ ఏడాది తొలి 6 నెలల్లో రెవెన్యూ వసూళ్లు 6 శాతం పెరిగాయని, అప్పులు గతం కన్నా రెట్టింపు అయ్యాయని, 23 శాతం ఖర్చులు అదనంగా చేశారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ సాయం 7,700 కోట్లు అదనంగా అందిందని, ఈ డబ్బంతా ఏమైందని యనమల నిలదీశారు. మార్కెట్​లో నిత్యావసర సరకుల ధరలకు, చేసే సంక్షేమానికి పొంతనే లేదన్నారు. జగన్ అవినీతి, చేతగాని పాలనతో అగమ్యగోచరంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని మండిపడ్డారు. తుగ్లక్ 2.0గా జగన్ రెడ్డి, గవర్నమెంట్ టెర్రరిజంతో ఏపీకి ఎనలేని చెడ్డపేరు తెచ్చారన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details