రెండో ఏడాదిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అప్పుల కుప్పలు, ప్రజలకు తిప్పలు తప్ప ఏమీ లేవని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. దురుద్దేశంతో ఎకనామిక్ సర్వే లెక్కలు తప్పుగా చెప్పారని ఆక్షేపించారు.
'60వేల కోట్ల అప్పులు చేయడమంటే... రాష్ట్రాన్ని ఊబిలోకి నెట్టడమే'
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రుణాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగారం లాంటి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ వ్యయం 6.6 శాతం పడిపోవడం ఆందోళనకరమని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఏళ్లలో 3 లక్షల కోట్ల అప్పులు ఉంటే వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పులకు సిద్దం అయ్యిందని ధ్వజమెత్తారు. ఏడాది కాలంలో 60 వేల కోట్ల అప్పులు చేయడమంటే రాష్ట్రాన్ని ఊబిలోకి నెట్టడమేనని తేల్చి చెప్పారు. జలవనరుల శాఖపై చివరి ఏడాది 14 వేల కోట్లు ఖర్చు చేస్తే వైకాపా తొలి ఏడాది కేవలం 4 వేల కోట్లే ఖర్చు చేసిందన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన 34 పథకాలను రద్దు చేసి సంక్షేమానికి తూట్లు పొడిచారని యనమల తూర్పారబట్టారు.
ఇవీ చదవండి:ఏడాదిలో సంక్షేమం కోసం రూ.43వేల కోట్లు ఖర్చు :సీఎం జగన్