రాజ్యాంగ సవరణ చట్టంలో ఆర్టికల్ 243లో పేర్కొన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 5వ రాష్ట్ర ఆర్ధిక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు యలమంచలి రాజేందప్రసాద్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వాలకు నిధులు ఎగొట్టడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతో రాష్ట్ర ఆర్ధిక సంఘాల సిఫార్సును అమలు చేయటం లేదని మండిపడ్డారు. పంచాయితీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో విజయవాడలో ఉమ్మడి కృష్ణా జిల్లా సర్పంచ్‌లు సమావేశం అయ్యారు.
ఐదో ఆర్థిక కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి - యలమంచలి న్యూస్
ఐదో ఆర్థిక కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు యలమంచలి రాజేందప్రసాద్ డిమాండ్ చేశారు. 2019 నుంచి 2022 వరకు మూడో ఆర్థిక సిఫార్సుల మేరకు ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్లు వెంటనే స్థానిక సంస్థలకు చెల్లించాలన్నారు.
ఐదో ఆర్థిక కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి
సర్పంచ్‌ల నిధులు, విధులు, అధికార సాధన కోసం సర్పంచ్‌ల సంఘం కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 2019 నుంచి 2022 వరకు మూడో ఆర్థిక సిఫార్సుల మేరకు ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్లు వెంటనే స్థానిక సంస్థలకు చెల్లించాలని కోరారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,020 కోట్ల నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేయకుండా ప్రభుత్వం ఆపేసిందని ధ్వజమెత్తారు.
ఇవీ చూడండి