విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థులు పర్యావరణానికి హాని చేయని వివిధ వస్తువులతో వినాయక విగ్రహాలు తయారు చేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు. పర్యావరణ రక్షణ వేదిక, సిద్ధార్థ మహిళా కళాశాల ఏకో క్లబ్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. రసాయనాలతో చేసిన వినాయకుడి ప్రతిమల వల్ల పర్యావరణం కలుషితమవుతుందని పేర్కొన్నారు. జీవవైవిధ్యానికి నష్టం చేయని మట్టి విగ్రహాలను పూజించాలని విద్యార్థినులు సూచించారు. పసుపు, గోధుమపిండి, మైదాపిండి, ఆకులు, పూలు,మట్టి, ఇంట్లో లభించే నిత్యావసర వస్తువులను వినియోగించి వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు.
మట్టి విగ్రహాలను పూజిద్దాం..పర్యావరణాన్ని కాపాడుదాం ! - protect the environment
పర్యావరణానికి హాని చేయని వివిధ రకాల వస్తువులతో వినాయక ప్రతిమలు తయారు చేసి విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. పర్యావరణానికి హాని చేయని విధంగా మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలని సూచించారు.
మట్టి విగ్రహాలను పూజిద్దాం