ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐఎస్ఐ హాల్ మార్క్ ముద్రణ, ప్రమాణాలపై అవగాహన కార్యక్రమాలు - ఐఎస్ఐ హాల్ మార్క్ ముద్రణ

World Standards Day: మనం ఎదైనా వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ఆ దుకాణదారుడు చెప్పే మాటలను నమ్ముతాము. ఎంతలా అంటే వారి మాటే ఐఎస్ఐ హాల్ మార్కు అన్నట్లుగా. అయితే, మనం కొనే వస్తువు నాణ్యత ప్రమాణాల మీద సందేహం వస్తే ఏం చేయాలి అనే అంశంపై చాలామందికి అవగాహన ఉండదు. అలాంటి వారి కోసమే ఓ యాప్ ఉందని తెలియ జేస్తున్నారు.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఏపీ హెడ్ వినోద్. వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఈ ఆదివారం స్టాండర్డ్ వాక్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

World Standards Day
ఐఎస్ఐ హాల్ మార్క్

By

Published : Oct 15, 2022, 3:26 PM IST

లైసెన్స్ లేకుండా ఐఎస్ఐ, హాల్ మార్క్ ముద్రలు వేసి వస్తువులు విక్రయించే వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుందని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఏపీ హెడ్ వినోద్ అన్నారు. సంబంధిత దుకాణాలకు హాల్ మార్క్ , ఐఎస్ఐ ముద్రలు వేసే లైసెన్స్ ఉన్నదా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అన్నారు.

ఇందుకోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఆన్ లైన్ యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చని పేర్కొన్నారు. వరల్డ్ స్టాండర్డ్స్ డే సందర్భంగా విజయవాడలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాణ్యతా ప్రమాణాలపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఆదివారం విజయవాడ ఎంజీ రోడ్​లో స్టాండర్డ్ వాక్ పేరుతో 2కె నడక నిర్వహించనున్నట్లు వినోద్ వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details