ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆరోగ్యం పట్ల అవగాహన అవసరం: మంత్రి మోపిదేవి - minister mopidevi venkata ramana

ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ సూచించారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో... నిర్వహించిన ప్రపంచ గుడ్డు దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

మోపిదేవి వెంకటరమణ

By

Published : Oct 11, 2019, 9:19 PM IST

మోపిదేవి వెంకటరమణ

ప్రధాన పౌష్టికాహారాలైన గుడ్లు, చేప, మాంసాల విభాగానికి మంత్రిగా ఉండటం తన అదృష్టమని... పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో... విజయవాడలో నిర్వహించిన ప్రపంచ గుడ్డు దినోత్సవంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనితతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ... కుటీర పరిశ్రమగా ఉన్న పౌల్ట్రీ రంగం... నేడు కార్పోరేట్ స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. గుడ్డు తింటే గ్యాస్ట్రిక్ సమస్య వస్తుందని ప్రచారం చేస్తున్నారని... అది నిజం కాదని వివరించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలకు గుడ్డు ప్రాధాన్యతను వివరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details