ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మద్యం దుకాణాలు మూయకుంటే.. ఉద్యమిస్తాం' - విజయవాడలో మహిళలు ధర్నా తాజా వార్తలు

కరోనా వ్యాప్తితో రాష్ట్రం అల్లాడుతుంటే.. సీఎం జగన్ ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మహిళా సంఘాలు ఆరోపించాయి. కరోనా ఇంకా విజృంభించేలా చర్యలు చేపడుతున్నారని అందుకు నిదర్శనం మద్యం దుకాణాలు తెరవడమేనని ఆరోపించారు.

womens protest
womens protest

By

Published : May 6, 2020, 3:49 PM IST

ఏపీలో మద్యం షాపులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చేపట్టారు. ధర్నా చౌక్ లో మహిళా సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మద్యం షాపుల వద్ద గుంపులుగా చేరిన కారణంగా... కరోనా వైరస్ మరింతగా విస్తరించే అవకాశం ఉందని మహిళా సంఘాలు మండిపడ్డాయి.

మద్యం దుకాణాలు నియంత్రిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చివరికి ఆదాయ వనరులుగా చూడటం సిగ్గు చేటన్నారు. మద్యాన్ని ఎత్తివేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం.. తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం షాపులు తెరిస్తే... రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details