ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతు చట్టాలకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ర్యాలీ - ఈరోజు విజయవాడలో మహిళా సంఘాలు ర్యాలీ వార్తలు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలు మహిళా సంఘాలు పాల్గొని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Women's Associations rally against central and state government policies
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు ర్యాలీ

By

Published : Jan 18, 2021, 4:45 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు ర్యాలీ

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, రైతులకు ద్రోహం చేస్తున్నారని మహిళా సంఘాల నాయకులు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 3 నెలలుగా దిల్లీలో వేదికగా ఉద్యమం చేస్తున్న రైతులను, 400 రోజులుగా రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. తక్షణమే మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details