గర్భిణీ స్త్రీలకు కరోనా పరీక్షలు చేసిన వెంటనే రిపోర్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరాయి. రిపోర్టులు సరైన సమయానికి రాక చాలామంది గర్భిణీ స్త్రీలు అవస్థలు పడుతున్నారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మహిళా సంఘాలు ధర్నా నిర్వహించాయి.
'గర్భిణీల కరోనా రోపోర్టులు త్వరగా వచ్చేలా చూడాలి' - గర్భిణీ స్త్రీలకు కరోనా
గర్భిణీ స్త్రీలకు కరోనా పరీక్షలు చేసిన వెంటనే రిపోర్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మహిళా సంఘాలు ధర్నా నిర్వహించాయి.
మహిళా సంఘాల ధర్నా
గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని... వేసెక్టమీ ఆపరేషన్లను ప్రోత్సహించాలని కోరారు. మహిళల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలపై వేధింపులు అరికట్టాలని కోరారు. మహిళలకు పట్టణ ఉపాధి చట్టం చేయాలని నినదించారు.
ఇదీ చదవండి: మాజీమంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు