ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెళ్లి చెడగొట్టారని ఓ వ్యక్తి వీరంగం... మద్యం తాగి మహిళను చంపిన వైనం... - వించిపెంటలో మహిళ మృతి

విజయవాడ వన్ టౌన్ వించిపేటలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి... మహిళను కత్తితో పొడిచాడు. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

women was killed by a drunkard in vinchipenta at vijayawada
మద్యం మత్తులో మహిళను పొడిచి చంపిన వ్యక్తి

By

Published : Nov 14, 2020, 9:16 AM IST

విజయవాడ వన్ టౌన్ వించిపేటలో మద్యం మత్తులో ఓ వ్యక్తి మహిళను కత్తితో పొడిచి చంపాడు. వించిపేటలో నివాసముంటున్న పైడమ్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలు... అదే ప్రాంతానికి చెందిన రామకృష్ణ మద్యం మత్తులో గొడవకు దిగి పైడమ్మను కత్తితో పొడిచాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని ఆసుపత్రికి తరిలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

మృతురాలి కుమారుడు చంద్రరావుతో... రామకృష్ణ గొడవ పడుతుండగా, పైడమ్మ అడ్డుకునే ప్రయత్నంలో కత్తి పోటుకు గురైంది. రామకృష్ణకు కుదిరిన పెళ్లిని చంద్రరావు చెడ్డకొట్టడానే కారణంతో... ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి ఈ హత్యకు దారీ తీసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు టూటౌన్ కొత్తపేట పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details