ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మెుదటి డోసు కోవిషీల్డ్.. రెండో డోసు కోవాగ్జిన్ వేశారు!

విజయవాడ నగరంలో జరుగుతున్న టీకా ప్రక్రియలో తారుమారు జరిగింది. కొత్తపేట కేబీఎన్ కాలేజీ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఓ మహిళకు కోవిషీల్డ్ బదులుగా కోవాగ్జిన్ టీకా వేశారు. ఆలస్యంగా నిజం తెలిసి అధికారులు షాక్ అయ్యారు. రెండ్రోజులపాటు మహిళను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

మెుదటి డోసు కోవిషీల్డ్.. రెండో డోసు కోవాగ్జిన్ వేశారు!
మెుదటి డోసు కోవిషీల్డ్.. రెండో డోసు కోవాగ్జిన్ వేశారు!

By

Published : Jun 5, 2021, 9:36 AM IST

వడ్డెర కాలనీకి చెందిన గొలుసు రమణమ్మ అనే మహిళ మొదటి డోసు కోవిషీల్డ్ తీసుకుంది. రెండో డోసు కోసం కేబీఎన్ కాలేజీకి రాగా సిబ్బంది కోవాగ్జిన్ టీకా వేశారు. రమణమ్మ కుమారుడు ఈ విషయం గుర్తించి.. టీకా తారుమారుగా వేశారని ప్రశ్నించగా.. తప్పు తెలుసుకుని రమణమ్మను ఆసుపత్రిలో చేర్చారు. మొదటి డోసు సమయంలో జి.రమణమ్మ అని ఎంటర్ చేశారని.. తాము గొలుసు రమణమ్మ అని కంప్యూటర్​లో ఎంటర్ చేశామని సిబ్బంది చెబుతున్నారు. మొదటి డోసు అనుకున్నామని చెప్పుకొచ్చారు. ఎవరైనా సరే ఆధార్, ఫోన్ నెంబర్ లను కంప్యూటర్ యాప్ లో ఎంటర్ చేస్తే సంబంధిత వ్యక్తి పూర్తి వివరాలు వస్తాయని.. తన తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినపుడు వివరాలు ఎందుకు రాలేదని.. రమణమ్మ కుమారుడు ప్రశ్నించారు. సిబ్బంది నిర్లక్ష్యంతో టీకా తారుమారుగా వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రమణమ్మను రెండు రోజులు పాటు ఆసుపత్రిలో ఉంచి వైద్యులు పర్యవేక్షించారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకపోవటంతో ఇంటికి పంపారు.

ABOUT THE AUTHOR

...view details