కృష్ణా జిల్లా విజయవాడలోని అజిత్సింగ్ నగర్ పోలీసులు ఆపదలో ఉన్న మహిళను కాపాడారు. ప్రేమ పేరుతో నమ్మివచ్చిన తనని నిఖిల్ అనే వ్యక్తి మోసం చేశాడని ఆ మహిళ దిశ కాల్ సెంటర్కి ఫోన్ చేసింది. ఈ అవమాన భారంతో సమాజంలో బతకలేనని... తన ఐదేళ్ల చిన్నారిని చేరదీయాలి పోలీసులను కోరింది. పురుగుల మందు తాగి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపింది. అప్రమత్తమైన పోలీసులు... మహిళ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. 10 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను గుర్తించి.. సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితురాలితో పాటే ఉన్న ఐదేళ్ల చిన్నారిని చేరదీశారు.
'నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను...నా బిడ్డను మీరే కాపాడాలి' - women suicide attempt in vijayawada
ప్రేమ పేరుతో మోసపోయానని ఓ మహిళ దిశ కాల్ సెంటర్కు ఫోన్ చేసింది. నమ్మి వచ్చిన వ్యక్తి.. తనని నడి రోడ్డుపై వదిలివేశాడని వాపోయింది. ఈ అవమాన భారంతో తాను బతకలేనంది. తన ఐదేళ్ల చిన్నారిని చేరదీయాలని విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? పోలీసులు ఏం చేశారు?
ఆత్మహత్యయత్నం