SUICIDE ATTEMPT: తన వాటా అడిగినందుకు వేధింపులు..దీంతో ఆమె.. - women sucide attempt in vijayawada
09:32 August 22
ఇద్దరు చిన్నారులతో కలిపి ఆత్మహత్యాయత్నం
తమ వాటా కింద వచ్చే ఆస్తి పంచమని అత్తింటి వారిని అడగ్గా.. తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారంటూ మనస్తాపంతో వివాహిత తన ఇద్దరి చిన్నారులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విజయవాడ రూరల్ మండలం నిడమానూరు రామానగర్లో చోటు చేసుకుంది. స్థానిక సూరెడ్డి దివ్య.. అత్తమామలు, మరిది కుటుంబీకులతో ఒకే ఇంట్లో వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ కారణంగా భర్త రెండు నెలల క్రితం చనిపోయాడు. అనంతరం అత్తింటివారు సరిగ్గా పట్టించుకోకపోవడంతో తమ బతుకు తాము బతుకుతామని అత్తింటి వారిని కోరగా.. అందుకు వారు ససేమిరా అనడంతో దివ్య మనస్తాపానికి గురైంది.
ఆన్లైన్లో సోడియం ఎజిన్ను తెప్పించుకొని గత రాత్రి సుమారు 2 గ్రాముల మేర నీటిలో సేవించింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ పెనమలూరులోని తన అక్కకు ఫోన్ చేసి విషయం చెప్పింది. హుటాహుటిన దివ్య ఇంటికి చేరిన తన అక్క బాధితురాలితో పాటు పిల్లలకు భార్గవ్ , రోహిత్ తాగించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ వారిని విజయవాడ ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించి పటమట పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం దివ్య, పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: