సన్నని ఇసుక. మెత్తని ఆ తడి ఇసుక కనిపిస్తే చాలు ఎవరైనా చిన్న పిల్లల్లాగా మారి ఆటలాడుతారు. అయితే ఇలాంటి వాతావరణం నదీ, సముద్ర తీరాల్లోనే ఉంటుంది. కానీ తెలంగాణలోని వరంగల్‌లో ఓ బీచ్ ప్రత్యక్షమైంది. అదేంటి సముద్రమే లేని చోట.... బీచ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా....?
ఇలా బీచ్..
బీచ్‌లోని ఇసుకలో సరదాగా ఆడుకోవాలనే కోరిక ఉన్నవారికోసం.... వరంగల్‌కు చెందిన కొంతమంది యువకులు ఓ చిట్కా ప్రయోగించారు. భద్రకాళి సరస్సు పక్కన బీచ్ జోన్ ఏర్పాటు చేశారు. అందులో అతివలు ఉత్సాహంగా వాలీబాల్ ఆడుతూ సందడి చేస్తున్నారు. వరంగల్‌లో బీచ్ వాలీ బాల్ ఆటకి ఫుల్ క్రేజ్ పెరిగింది.
ఉత్సాహంగా బీచ్‌బాల్
బీచ్‌బాల్ అయితే ఏకంగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. అలాంటి వారి కోరికను తీర్చడం కోసం వరంగల్‌కు చెందిన కొంతమంది యువకులు వినూత్న ప్రయత్నం చేశారు. వరంగల్- హన్మకొండ జంట నగరాల మధ్య ఉన్న భద్రకాళి బండ్ పక్కనే బీచ్ బాల్ జోన్ ఏర్పాటు చేశారు. సరిగ్గా సముద్రపు ఇసుకలో ఆడుతున్న అనుభూతిని కలిగించేలా తీర్చిదిద్దారు. ఇందులో మహిళలు ఉత్సాహంగా బీచ్‌బాల్ ఆడుతున్నారు. పురుషులతో పాటు మహిళలు సైతం పోటాపోటీగా ఆడుతున్నారు.
మహిళలే అధికం