ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మహిళలు కెరీర్ కోసం దీర్ఘకాలం ప్రయాణం చేసేందుకు సిద్దంగా లేరు' - BHARAT BIOTECH JMD on lock down

మంచి జీవితం నిర్మించుకోవాలంటే చిత్తశుద్ధి, త్యాగం ఉండాలని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్రా ఎల్ల అన్నారు. ప్రస్తుత తరం మహిళలు కెరీర్ నిర్మించుకునేందుకు, దీర్ఘకాలం ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉండటం లేదని అభిప్రాయపడ్డారు.

BHARAT BIOTECH JMD SPEAKS ON FUTURE OF WOMEN
భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్రా ఎల్ల

By

Published : Mar 16, 2021, 6:48 AM IST

'మహిళలు కెరీర్ కోసం దీర్ఘకాలం ప్రయాణం చేసేందుకు సిద్దంగా లేరు'

గత సంవత్సరం కరోనా కారణంగా లాక్​డౌన్ విధించినప్పుడు పురుషులతో సమానంగా మహిళలు పనిచేశారని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్రా ఎల్ల తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రేయిన్​బో ఆస్పత్రుల యజమాన్యం.. 'నాయకత్వంలో మహిళలు-సవాళ్లు, పరిష్కారాలు' అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

కరోనా టీకాకు సంబంధించి ఆర్​ అండ్​ డీ బృందంలో ఉన్న మహిళలు.. పనిచేసేందుకు ఎప్పుడూ నిరాకరించలేదని పేర్కొన్నారు. ప్రస్తుత తరం మహిళలు కెరీర్ నిర్మించుకునేందుకు దీర్ఘకాలం ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉండటం లేదని గమనిస్తున్నట్లు తెలిపారు. మంచి జీవితం నిర్మించుకోవాలంటే చిత్తశుద్ధి, త్యాగం ఉండాలని వ్యాఖ్యానించారు. మహిళల భవిష్యత్​ గురించి హైస్కూల్ నుంచే అవగాహన కల్పించాలని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details