బస్సు తన ద్విచక్ర వాహనానికి తగిలిందని ఓ మహిళ.. బస్సు డ్రైవర్ పై మహిళ భౌతిక దాడికి దిగిన సంఘటన విజయవాడ సూర్యారావు పేట ఐదో నంబరు రోడ్డులో చోటుచేసుకుంది. నగరంలో రద్దీగా ఉండే ఐదో నెంబర్ రోడ్ లో స్కూటీ పై వెళ్తున్న మహిళ రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలో బస్సు తగలడంతో కింద పడిపోయింది.
ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ దాడి.. అంతటితో ఆగకుండా..
రాజ్‌భవన్ రోడ్డులో ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ వీరంగం సృష్టించింది. తన ద్విచక్రవాహనానికి బస్సు తగిలిందని ఆగ్రహంతో డ్రైవర్‌పై దాడికి దిగింది. అంతటితో ఆగకుండా డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రమాదం సమయంలో బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పింది. దీంతో.. సదరు మహిళ బస్సు డ్రైవర్ ను దుర్భాషలాడుతూ ఏకంగా భౌతిక దాడికి పాల్పడింది. స్థానికులు అక్కడికి చేరుకుని మహిళను నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ మాట వినకుండా డ్రైవర్‌ను చితకబాదింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఇదీ చదవండి:Sarayu trial: బంజారాహిల్స్ పీఎస్‌లో యూట్యూబర్ సరయూ విచారణ