గత బుధవారం దిల్లీ నుంచి బెంగళూరు వెళ్తోంది విమానం. విమానం టేకాఫ్ అయిన పదినిమిషాల్లోనే అందులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి పురిటినొప్పులు మెుదలయ్యాయి. విమానంలో ఉన్న గైనకాలజిస్టు శైలజ వెంటనే స్పందించారు. వెంటనే క్యాబిన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. పీపీఈ కిట్లతోనే కాన్పు ప్రక్రియ ప్రారంభించారు. శిశువు నెలలు నిండకముందే పుట్టాడు. 35 వేల అడుగుల ఎత్తులో కాన్పు విజయవంతమైంది. వసతులు లేకపోవడం వల్ల కంగారూ పద్ధతిలో కాన్పు చేసినట్లు డాక్టర్ శైలజ చెప్పారు. ఇంక్యుబేటర్ వంటి వాతావరణం సృష్టించామని పేర్కొన్నారు.
విమానంలో గర్భిణికి కాన్పు- వైద్యురాలితో ఈటీవీభారత్ ముఖాముఖి - విమానంలో గర్భిణి కాన్పు వార్తలు
35 వేల అడుగుల ఎత్తులో విమాన యానం.. ఉన్నట్లుండి ఓ గర్భిణికి పురిటినొప్పులు.. అనుకోని పరిస్థితుల్లో ఓ వైద్యురాలు విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత.. విమానంలో గట్టిగా శిశువు ఏడుపు వినపడింది. ఇంకేముంది ప్రయాణికులంతా ఆ గైనకాలజిస్టును చప్పట్లతో అభినందించారు. డెలివరీకి సహకరించేలా ఎలాంటి పరికరాలూ లేని సమయంలో.. సమర్థంగా బాధ్యత నిర్వర్తించిన కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ శైలజ వల్లభనేనితో.. మా ప్రతినిధి ముఖాముఖి..
35 వేల అడుగుల ఎత్తులో విమానం.. గర్భిణికి కాన్పు