WOMAN ATTACK: వాహనం చేతిలో ఉంటే చాలు.. మాకు ఎవరితో పని లేదు అనుకుంటున్నారు నేటి యువత. వాళ్లకు ఎవరైనా అడ్డం వచ్చిన లేక వారి బండిని ఓవర్ టేక్ చేసిన వాళ్ల అంతుచూసేదాకా ఆగడంలేదు. మనుషులమనే విచక్షణ కోల్పోయి.. దాడి చేస్తున్నారు. మొన్న హైదరాబాద్‌లో ఆటోను పక్కకు తీయమన్నందుకు ఆ డ్రైవర్ విచక్షణ కోల్పోయి.. బస్సు డ్రైవర్‌పై దాడి చేశాడు. ఈ ఘటన మరువకముందే విజయవాడలో ఇలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. నా బండినే గుద్దుతావా అని ఓ మహిళ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది.
"నా బండికే డ్యాష్ ఇస్తావా..? నీ అంతు చూస్తా".. బస్సు డ్రైవర్‌పై మహిళ దాడి
WOMAN ATTACK: ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు పెరుగుతున్నాయి. బండి పక్కకు తీయమన్నందుకు కొందరు.. నన్నే దాటేస్తావా అని మరికొందరు అసభ్యపదజాలంతో దూషించడం లాంటివి ఎక్కువవుతున్నాయి. గత నెలలో విజయవాడలో ఓ ఇద్దరు యువకులు బస్సు డ్రైవర్‌పై దాడి మరువకముందే.. మరో మహిళ హల్చల్ చేసింది.
WOMAN ATTACK
అసలేం జరిగిందంటే: విజయవాడలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఆర్టీసీ బస్సు.. తన బైకును ఢీకొట్టిందంటూ ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోపంలో ఊగిపోతూ బస్సును ఆపింది. అనంతరం బస్సు డ్రైవర్‌ను చితకబాదింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: