ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్టోబర్ 28 నాటికి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ

దేశంలో అక్టోబర్ 28 నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వైదొలిగే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, తెలంగాణల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఉపసంహరణ ప్రారంభమైంది.

south west mansoon
దేశంలో అక్టోబర్ 28 నాటికి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ

By

Published : Oct 26, 2020, 5:29 PM IST

కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ మొదలైంది. బంగాళాఖాతం దక్షిణ ద్వీపకల్ప భారతదేశంపై దిగువ ట్రోపోస్పియర్ స్థాయిల్లో ఈశాన్య గాలులు ఏర్పడ్డాయి. దీంతో నైరుతి రుతుపవనాలు 28, అక్టోబర్ నాటికి దేశం నుంచి పూర్తిగా వైదొలిగే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర దానిని ఆనుకుని ఉన్న కర్ణాటక, కేరళలలో 28, అక్టోబర్ 2020న ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం... ప్రస్తుతం ఈశాన్య, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో 3.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకు నైరుతీ బంగాళాఖాతం మీదుగా 1.5 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

దీని ప్రభావం వలన రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు, రేపు పొడి వాతావరణం ఉంటుంది. ఎల్లుండి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి.

ఇవీ చదవండి..

ఆ దేశాల్లోనే కాదు.. సీమలోనూ డ్రాగన్ ఫ్రూట్​ పండించొచ్చు!

ABOUT THE AUTHOR

...view details