ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పొరుగు రాష్ట్రాల మద్యం పట్టివేత

కర్నూలు, కృష్ణా జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో ఎస్​ఈబీ అధికారులు, పోలీసులు భారీగా అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు.

wine seized to illegal moving from telangana at kurnool, krishna district
పొరుగు రాష్ట్రాల నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత

By

Published : Aug 9, 2020, 5:25 PM IST

కర్నూలు జిల్లాలో అక్రమ మద్యం రవాణా, నాటుసారా స్థావరాలపై ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేని 42 కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలకు సంబంధించి 57 మందిని అరెస్టు చేయగా.. 237 లీటర్ల నాటుసారా, 5,306 మద్యం సీసాలతో పాటు 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాణ్యం సమీపంలోని తమ్మరాజుపల్లే వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు.

కృష్ణా జిల్లాలో...

కృష్ణా జిల్లా మైలవరంలో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. 891 మద్యం సీసాలు, ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తుకలపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

'ఈ ప్రమాదం హృదయవిదారకరం.. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి'

ABOUT THE AUTHOR

...view details