ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో తెదేపాను అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పని చేస్తానని తెదేపా నూతన అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తన ఎన్నికకు సహకరించిన తెదేపా అధినేతతో పాటు పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ... ప్రజా వ్యతిరేక విధానాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తానని తెలిపారు. బలహీన వర్గాలను చైతన్యపరుస్తూ.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతానని పేర్కొన్నారు. పార్టీకి పునర్వవైభవం తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు.