దసరా ఉత్సవాలకు ఒక రోజు ముందు దుర్గమ్మ అంతరాలయంలో (Vijayawada Durga Temple) విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందడం బాధాకరమన్నారు జనసేన పార్టీ (Janasena Party) రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. విజయవాడలో దసరా ఉత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. దేవాదాయ శాఖ మంత్రి అవినీతి కార్యక్రమాలు వల్లే ఇలాంటి అపశృతులు జరుగుతున్నాయని ఆరోపించారు. డబ్బున్నవారికే అన్ని ఏర్పాట్లు చేశారు...సామాన్య భక్తులకు సౌకర్యాలు కల్పించరా అని నిలదీశారు.
DURGA TEMPLE: 'దుర్గమ్మ సన్నిధిలో సామాన్య భక్తులకు సౌకర్యాలు కల్పించరా?' - విజయవాడ దుర్గ గుడిలో జనసేన పరిశీలన
దసరా ఉత్సవాలకు ఒక రోజు ముందు దుర్గమ్మ(Vijayawada Durga Temple) అంతరాలయంలో విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందడం బాధాకరమన్నారు జనసేన పార్టీ (Janasena Party) రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. విజయవాడలో దసరా ఉత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
దుర్గమ్మ సన్నిధిలో సామాన్య భక్తులకు సౌకర్యాలు కల్పించరా ? -పోతిన వెంకట మహేష్
గుడికి భారీ మొత్తంలో డబ్బు ఎగ్గొట్టి.. బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్ జొన్నలగడ్డ రమేష్‌కు టెండరు అప్పగించడం ఏంటని ప్రశ్నించారు. దీని వెనుక మల్లాది విష్ణు హస్తముందని విమర్శించారు. టెండర్లు పిలిచిన తర్వాత ఈ డ్రామాలేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సామాన్య భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మహేష్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి