ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: భర్తను హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన భార్య - telangana news today

భర్త కనిపించడం లేదని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. కానీ ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. భర్తని భార్యే హత్య చేసిన ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో చోటు చేసుకుంది.

murder
భర్తను హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన భార్య

By

Published : Mar 10, 2021, 5:11 PM IST

తెలంగాణ రంగారెడ్డి జిలాలోని వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టింది. ఈ ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. గత నెల 8న గగన్‌ అగర్వాల్ (38) అదృశ్యమయ్యాడు. కనిపించడం లేదని భార్య, మృతుని సోదరుడు ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేసిన పోలీసులు గగన్‌ అగర్వాల్‌ను భార్య హత్య చేసినట్లుగా గుర్తించారు. రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులిచ్చిన గగన్... జూన్‌లో నౌసిన్‌ బేగంను రెండో పెళ్లి చేసుకున్నాడు. హత్యకు గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. నౌసిన్ బేగంను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇదీ చూడండి :'దొంగ ఓట్లు వేసేందుకు వైకాపా నాయకులు కుట్ర చేస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details