ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

meeseva employee murder at-peddapalli : మీసేవ ఉద్యోగి శంకర్ హత్యకేసులో.. భార్యే నిందితురాలు - భర్తను దారుణంగా చంపిన భార్య

మీసేవ ఉద్యోగి శంకర్ హత్యకేసులో.. భార్యే నిందితురాలని తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను ప్రియుడితో కలిసి భార్యే హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది(meeseva employee murder at-peddapalli).

murder
murder

By

Published : Nov 29, 2021, 6:06 PM IST

Updated : Nov 29, 2021, 7:09 PM IST

meeseva employee murder at-peddapalli: ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే దారుణంగా హతమార్చింది ఓ ఇల్లాలు. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. అతనిని కిరాతకంగా చంపి.. తల, మొండెం, చేతులు వేరు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. మృతుడి తల, చేతులు రోడ్డు పక్కన లభ్యం కాగా.. మొండెం కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. రెండ్రోజుల క్రితం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం మండల పరిధిలో దారుణ హత్యకు గురైన మీ సేవ ఉద్యోగి హత్య కేసులో వెలుగు చూసిన వాస్తవాలు ఇవి. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇంకా దొరకని మొండెం
మండలంలోని కాజిపల్లి గ్రామానికి చెందిన శంకర్​.. మీ సేవ ఉద్యోగి(Mee Seva Employee Murder)గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన శంకర్​.. ఈ నెల 27న కుందనపల్లిలోని రాజీవ్​ రహదారి పక్కన శవమై ఉన్నాడు. తల, చేతులు రోడ్డుపై పడేసి ఉండగా మొండెం ఇంకా దొరకలేదు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి భార్యే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని పోలీసులు చెప్పారు. మృతుడి భార్య హేమలత, ప్రియుడు పాయలరాజును అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2 కత్తులు, పగిలిన బీరు సీసా, 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉత్కంఠకు దారితీసింది.

ఇటీవల జరిగిన పలు ఉదంతాలు
వివాహేతర సంబంధాలు, డబ్బు మోజులో పడి మూడు ముళ్ల బంధాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు కొందరు భార్యలు. క్షణిక సంతోషాలకు లోనై.. తమతో పాటు తమ పిల్లల భవిష్యత్తును కాలరాస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలవుతున్నారు. కడుపున పుట్టిన పిల్లలను అనాథలను చేస్తున్నారు. భర్త వేధింపులు తాళలేక కొందరు, ఇతర ఆకర్షణలకు లోనై మరికొందరు హత్యలకు పాల్పడుతున్నారు. గతేడాది సినీఫక్కీలో భర్తను హతమార్చింది ఓ భార్య.

జీవితాంతం కలిసి ఉందామని పెళ్లాడింది. ముద్దుగా ముగ్గురు పిల్లలు. సాఫీగా సాగుతున్న సంసారంలో భార్య వివాహేతర సంబంధం... భర్తను కడతేర్చే వరకు వెళ్లింది.

కూతురు ప్రేమ వివాహానికి, కుమారుడి ఉద్యోగానికి భర్త అడ్డుగా వస్తున్నాడని భావించిన భార్య.. భర్తను చంపాలని నిర్ణయించుకుంది. కరోనా వంకతో ఇంటికి రప్పించుకుని హతమార్చారు.

ఇదీ చదవండి:TAMILANADU WOMAN SARPANCH ARRESTED IN CHITTOOR DISTRICT : తమిళనాడు మహిళా సర్పంచ్ అరెస్టు.. దందా మామూలుగా లేదుగా!

Last Updated : Nov 29, 2021, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details