vice president venkaiah naidu on amaravathi : అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికార వైకాపా ఎంపీలే అంగీకరిస్తుంటే....ఆందోళన అవసరం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో ప్రస్తావించారు. తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ సభలో ఈ అంశాన్ని లెవనెత్తినప్పుడు ఈ సంభాషణ చోటు చేసుకుంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు తెర మీదకు తెచ్చారంటూ రవీంద్రకుమార్ తెలిపారు. ప్రధాని మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాకుండా అభివృద్ధి పనులకు 15 వేల కోట్లు నిధులు ఇచ్చారని వివరిస్తున్నప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలగచేసుకున్నారు. అధికార పార్టీ నేతలే అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటుంటే మీకు ఆందోళన ఎందుకంటూ వ్యాఖ్యానించారు.
VICE PRESIDENT VENKAIAH NAIDU ON AMARAVATHI : 'అమరావతిని అధికార పార్టీ ఎంపీలే అంగీకరిస్తుంటే ఆందోళన ఎందుకు..?' - venkaiah naidu on amaravathi
vice president venkaiah naidu on amaravathi : రాజధాని అమరావతిపై రాజ్యసభలో కీలక చర్చ జరిగింది. అమరావతిని అధికార పార్టీ ఎంపీలే అంగీకరిస్తుంటే ఆందోళన ఎందుకని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సభలో రాజధాని అంశాన్ని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ లేవనెత్తగా..ఉపరాష్ట్రపతి కలగజేసుకుని ఈ మేరకు సమాధానమిచ్చారు.
తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్
Last Updated : Dec 4, 2021, 6:24 AM IST