కొవిడ్ రోగులకు అత్యవసర చికిత్స నిమిత్తం రాష్ట్రానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ... 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసిందని కొవిడ్ స్పెషల్ ఆఫీసర్ డా. అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో వివిధ కొవిడ్ కేర్ సెంటర్లలో వినియోగించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
రాష్ట్రానికి వంద ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన డబ్ల్యూహెచ్‌వో
రాష్ట్రానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించిందని కొవిడ్ స్పెషల్ ఆఫీసర్ డా. అర్జా శ్రీకాంత్ వెల్లడించారు. వీటిని విశాఖ జిల్లాలోని వివిధ కొవిడ్ సెంటర్లలో వినియోగించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మరో 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించాలని డబ్ల్యూహెచ్‌వోను కోరామన్నారు.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసిన డబ్యూహెచ్‌వో
డా. అర్జా శ్రీకాంత్, స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.బి.ఎస్.హెచ్.దేవి, ప్రపంచ ఆరోగ్యసంస్థ సర్వైలైన్స్ మెడికల్ ఆఫీసర్ సమావేశం అయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధిని మరో 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించాలని.. వాటిని అనంతపురం జిల్లాలో ఏర్పాటవుతున్న 300 పడకల కొవిడ్ కేర్ సెంటర్లో వినియోగించుకుంటామని అర్జా శ్రీకాంత్ కోరారు. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి కూడా సానుకూలంగా స్పందించారు.
ఇదీ చదవండి