పీఎం ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వటం లేదంటూ... దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో 85 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తైనా.. ప్రభుత్వం పేదలకు కేటాయించటం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి కేంద్రం ఎంత నిధులు కేటాయించింది, ప్రధాని ఆవాస్ యోజన పథకం ప్రయోజనాలు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
పీఎం ఆవాస్ యోజన పథకం ప్రయోజనాలేంటి: హైకోర్టు - పీఎం ఆవాస్ యోజన పథకం వార్తలు
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం ఎంత నిధులు కేటాయించిందో తెలపటంతో పాటు ఆ పథకం ప్రయోజనాలేంటో వివరించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.
పీఎం ఆవాస్ యోజన పథకం ప్రయోజనాలేంటి