కరెంట్ బిల్లులతో పింఛన్లకు లింక్ పెట్టడమేంటని వైకాపా ప్రభుత్వాన్ని తెదేపా నేత అచ్చెన్నాయుడు నిలదీశారు. పింఛన్ల పంపిణీ కోసం జగన్ అదనంగా 1600 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఆ డబ్బుతో లక్షల మందికి పింఛన్లు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. వెయ్యి ఉన్న పింఛన్లను 2 వేల 250కి పెంచామని అసత్యప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలోనే పింఛన్లు 2 వేలుగా ఉండేదని ఆ విషయం ప్రజలందరికీ తెలుసునని అన్నారు. వైకాపా కార్యకర్తలకు మాత్రమే పింఛన్లు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పింఛన్లతో ఆధార్ లింక్ చేయాలని సవాల్ విసిరారు.
'పింఛన్లు - కరెంట్ బిల్లుకు లింక్ ఏంటి?'
వెయ్యి ఉన్న పింఛన్లను 2,250 కి పెంచామని జగన్ అసత్య ప్రచారం చేసుకుంటున్నారని తెదేపా నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. పింఛన్లతో కరెంట్ బిల్లులకు లింక్ పెట్టడమేంటని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెదేపా నేత అచ్చెన్నాయుడు