పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేయలేదనే కోపంతో.. వివిధ ప్రాంతాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నారని.. తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు విమర్శించారు. కొందరికి పింఛన్లు తొలగించటంతో పాటు.. కొన్ని చోట్ల నీటి సరఫరా, విద్యుత్ సరఫరా నిలిపివేయటం వంటి చర్యలకు అధికార పార్టీ పాల్పడుతోందని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలోని రెండు గ్రామాల్లో 70మందికి, గుంటూరులో 150 మందికి పింఛన్లను తొలిగించారని ఆరోపించారు. చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో నిర్భందించి.. సీఎం జగన్ పెద్ద తప్పు చేశారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాకు సామంతరాజులా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
'సంక్షేమ పథకాలు నిలిపేస్తున్నారు' - వైకాపాపై మండిపడ్డ తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు
పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులకు ఓట్లు వేయలేదనే నెపంతో.. ప్రజలకు సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నారని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు మండిపడ్డారు. చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో నిర్భందించి.. సీఎం జగన్ పెద్ద తప్పు చేశారని ఆగ్రహానికి గురయ్యారు.
'వైకాపాకు ఓట్లు వేయలేదని సంక్షేమ పథకాలు నిలిపేస్తున్నారు'