రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశాలకు (ఈఏపీసెట్) ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగించారు. ఇప్పటివరకు ఇంటర్ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీని తొలగించింది. ఈ ఏడాది ఈఏపీసెట్ 100 శాతం రాత పరీక్ష మార్కుల ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయని ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు చేసినందున ఈ ఒక్క ఏడాదికే ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగింపు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగింపు - Weight removal of inter-marks in EAPSet
18:56 July 27
రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం
ఏపీ ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)-21ను ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈఏపీసెట్‌ను గతంలో ఎంసెట్‌గా పిలిచేవారు. వైద్యవిద్యలో ప్రవేశాలకోసం జాతీయస్థాయిలో ప్రత్యేక పరీక్ష (నీట్) నిర్వహిస్తున్నందున ఎంసెట్‌లో 'ఎం' అనే అక్షరాన్ని తొలగించారు. ఫార్మసీ ప్రవేశాలను ఈ ప్రవేశ పరీక్షద్వారా నిర్వహిస్తున్నందున 'ఎం' స్థానంలో 'పి' ని చేర్చి ఈఏపీసెట్‌గా మార్పు చేశారు.
ఇదీ చదవండి
GOVT LANDS: స్మార్ట్ టౌన్‌ల నిర్మాణం కోసం.. 'నిరుపయోగ భూములు'!