ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో వచ్చే రెండ్రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు... కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలులో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రేపు, ఎల్లుండి వర్షాలు - ఏపీలో వాతావరణ వార్తలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రేపు, ఎల్లుండి వర్షాలు