ap Weather: మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తర్వాత ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
ap Weather: ఉపరితల ఆవర్తన ప్రభావం.. రెండు రోజుల్లో వర్షసూచన - అమరావతి వాతావరణ కేంద్రం
ap Weather: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
తగ్గిన ఉష్ణోగ్రతలు:ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చాయని వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరంలో అత్యధికంగా 40.57 డిగ్రీలు నమోదవ్వగా.. అత్యల్పంగా పాడేరులో 33.51 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు 40.11, విజయవాడ 40,రాజమహేంద్రవరం 39.2, అమరావతి 38.81, కడప 38.4, నంద్యాల 38.12, బాపట్ల 38, నరసరావుపేట 37.54, ఏలూరు 37.13, పార్వతీపురం 37, చిత్తూరు 37, అనకాపల్లి 36.87, అనంతపురం 36.7, తిరుపతి 36.62, కాకినాడ 36.5, భీమవరం 36.05, ఒంగోలు 35.6, గుంటూరు 34.9, మచిలీపట్నం 34.9, నెల్లూరు 34.6, శ్రీకాకుళం 34, విశాఖలో 33.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: రైల్వేస్టేషన్లలో.. మహిళలకు రక్షణేది?