Weather: దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Weather Update: దక్షిణ అండమాన్లో అల్పపీడనం... 48 గంటల్లో..
Weather: దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం
ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం:రాష్ట్రంలో పలుచోట్ల భారీ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా మన్యం జిల్లాలో వృక్షాలు నేలకొరిగాయి. సత్యసాయి జిల్లా హిందూపురంలో అరగంటపాటు కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ఇదీ చదవండి:'అసహనం పక్కనపెట్టి పనిపై దృష్టి పెడితే...పరిస్థితులు మెరుగుపడతాయి'