ఆయుధ సంపత్తి తనిఖీల్లో భాగంగా ఆర్ముడ్ రిజర్వ్ విభాగంనందున్న ఆయుధ సంపత్తిని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తనిఖీలు చేశారు. ఆయుధాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఆయుధాల్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ట్రైనీ డీఎస్పీ ధర్మేంద్ర, ట్రైనీ డీఎస్పీ శ్రావణి, స్పెషల్ బ్రాంచ్ సీఐ నాగేంద్ర కుమార్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
ఆయుధ సంపత్తి తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ - krishna district sp ravindranath babu latest news
ఏటా నిర్వహించే ఆయుధ సంపత్తి తనిఖీల్లో భాగంగా విజయవాడలో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆయుధాలను తనిఖీలు చేశారు. వీటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు.

ఆయుధాలను తనిఖీలు చేస్తున్న జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు