వైకాపా బలపర్చిన అభ్యర్థులను ఓడించాలి: శైలజానాథ్ - 100 స్థానాలను గెలుస్తాం తాజా వార్తలు
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికిన వైకాపా ప్రభుత్వం... రైతుల వ్యవసాయ జీవితాలకు ఉరి వేసిందని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విమర్శించారు. రైతుల భవిష్యత్తు కోసం.. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థులను ఓడించాలని ప్రజలను కోరారు.
![వైకాపా బలపర్చిన అభ్యర్థులను ఓడించాలి: శైలజానాథ్ We will win 100 seats APCC President Shailajanath](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10421845-634-10421845-1611908311188.jpg)
త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థులను ఓడించాలని.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రజలను కోరారు. వారిని ఓడిస్తేనే రైతులను గెలిపించినట్టు అవుతుందని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న జగన్ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటు హక్కుతో బుద్ధిచెప్పాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ఏకగ్రీవాలు జరిగితే.. విద్యుత్ సంస్కరణల్లో మోటార్లకు మీటర్లు పెట్టడానికి పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని వివరించారు.