రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని.. శాంతిభద్రతలు కరువయ్యాయని మాజీమంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఒక మాజీ ముఖ్యమంత్రి.. జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ప్రజా నాయకుడు నివసిస్తున్న నివాసంపై అరాచక శక్తులు దాడికి యత్నించగా.. దాన్ని కనీసం పోలీసులు ఖండించకుండా ప్రేక్షకపాత్ర వహించారని ఉమ ఆగ్రహించారు. పోలీసుల తీరుపై రాష్ట్రపతికి, కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నట్లు ఉమ తెలిపారు. హెరాయిన్ గురించి చర్చ జరుగుతుంటే దానిని తప్పుదోవ పట్టించడానికి బూతుల మంత్రులను రంగంలోకి దించుతున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మంత్రులచేత కులాలను మతాలను రెచ్చగొట్టి బూతుల పంచాంగాలను చదివిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి చేస్తున్న ఈ అరాచకాలకు రాష్ట్ర ప్రజలు తొందర్లోనే బుద్ధి చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.
Devineni Uma: పోలీసుల తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: మాజీమంత్రి దేవినేని ఉమా - వైకాపా పాలనపై దేవినేని ఉమ వ్యాఖ్యలు
రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని.. శాంతిభద్రతలు కరువయ్యాయని మాజీమంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని.. శాంతిభద్రతలు కరువయ్యాయని మాజీమంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ఒక మాజీ ముఖ్యమంత్రి... జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ప్రజా నాయకుడు నివసిస్తున్న నివాసంపై అరాచక శక్తులు దాడికి యత్నించగా.. దాన్ని కనీసం పోలీసులు ఖండించకుండా ప్రేక్షకపాత్ర వహించారని ఉమ ఆగ్రహించారు.
పోలీసుల తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం -మాజీమంత్రి దేవినేని ఉమా
రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీమంత్రి పిలుపునిచ్చారు. మైలవరంలో నిర్వహించే రైతుల నిరసన పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి : chain snatchers: గొలుసు దొంగలకు స్థానికుల దేహశుద్ధి