ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అన్ని పార్టీల నేతల ఫిర్యాదులూ స్వీకరిస్తున్నాం: డీజీపీ - మాచర్ల ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలు

మాచర్ల దాడి ఘటన నిందితులను అరెస్టు చేసి గురజాల సబ్​జైలుకు పంపామని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల నేతల ఫిర్యాదులూ స్వీకరించటంతో పాటు వెంటనే విచారణ జరిపిస్తున్నామన్నారు.

అన్ని పార్టీల నేతల ఫిర్యాదులూ స్వీకరిస్తున్నాం
అన్ని పార్టీల నేతల ఫిర్యాదులూ స్వీకరిస్తున్నాం

By

Published : Mar 13, 2020, 10:50 PM IST

స్థానిక ఎన్నికల సందర్భంగా పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉన్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అన్ని పార్టీల నేతల ఫిర్యాదులూ స్వీకరిస్తూ... వెంటనే విచారణ జరిపిస్తున్నామన్నారు. ఘటనల వివరాలు, దర్యాప్తు సమాచారం ఎప్పటికప్పుడు ఎస్​ఈసీకి ఇస్తున్నామని వెల్లడించారు. మాచర్ల దాడి ఘటన నిందితులపై సెక్షన్​ 307 కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని.. వారిని గురజాల సబ్​జైలుకు పంపామన్నారు. దాడి ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగించటంతో పాటు పోలీసులకు చెప్పి వెళ్లామంటున్న తెదేపా నేతల వ్యాఖ్యలపైనా విచారణ చేస్తున్నామని డీజీపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details