ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తాం: బీసీ సంక్షేమ సంఘం

బీసీ సంఘాలన్నింటినీ కలుపుకొని త్వరలోనే నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు స్పష్టం చేశారు. విజయవాడలోని ఏపీ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప చట్టసభల్లో సముచిత స్థానం కల్పించలేదన్నారు.

bc
నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తాం

By

Published : Nov 1, 2020, 5:08 PM IST

నూతన రాజకీయ పార్టీ స్థాపన దిశగా బీసీ సంక్షేమ సంఘాల నాయకులు గుంటూరులో భేటీ అయ్యారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్రంలోని 13 జిల్లాల బీసీ నాయకులు, జాతీయ నాయకులు పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప... ఎవరూ చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడం లేదని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై ఇప్పటికే అనేక ఉద్యమాలు చేశామన్నారు. సంఘాలన్నింటినీ కలుపుకొని త్వరలోనే నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు కేంద్రంలోనూ, రాష్ట్రంలో 50 శాతం చట్టసభల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే కార్యాచరణ రూపొందించి బీసీల రాజకీయ పార్టీకి శ్రీకారం చూడతామన్నారు.

రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలు పెరిగిపోయాయని తెలంగాణా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాసరావు విమర్శించారు. అగ్రవర్గాల వారికే తప్ప బీసీలు, మైనార్టీలకు రాజకీయాలలో అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ వివక్షపై ఆంధ్రప్రదేశ్​లో ఓట్లు మావే-సీట్లు మావే అనే నినాదంతో ముందుకు వెళతామన్నారు. 6 నెలలో వ్యవధిలో ఒక పెద్ద రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామన్నారు. అంచెలంచెలుగా పార్టీని బలోపేతం చేసి రాజకీయాలలో ఒక ప్రత్యేక ముద్ర వేస్తామన్నారు. ఈ సమావేశంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి శ్యామ్ ప్రసాద్, బీసీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, జాతీయ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details