మన రాష్ట్రానికి చెందిన 8వేల పైచిలుకు ప్రజలు పది రాష్ట్రాల్లోని 24 చోట్ల చిక్కుకుపోయారని కరోనా టాస్క్‌ఫోర్స్ ఇన్ఛార్జ్ కృష్ణబాబు స్పష్టం చేశారు. ఆయా జిల్లాలకు చెందిన అధికారులను అక్కడికి పంపి వారికి భోజన ఏర్పాట్లు చేశామన్నారు. ఏపీలో ఇతర రాష్ట్రాలకు చెందిన 53 వేల మందికి 354 క్యాంపులు ఏర్పాటు చేసి వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పరిశ్రమల్లో పని చేస్తున్న వలసకూలీలకు ఎన్జీఓ సంస్థల ద్వారా భోజన వసతి కల్పించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. లాక్డౌన్ ముగిసిన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల ఆధారంగా తదుపరి చర్యలుంటాయని వెల్లడించారు. అత్యవసర రవాణా కోసం ఈ-పాస్ జారీచేస్తూ...నిత్యావసర వస్తువుల సరఫరాలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు.
'ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ ప్రజల బాగోగులు చూస్తున్నాం' - ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ ప్రజల బాగోగులు చూస్తున్నాం
లాక్డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని కరోనా టాస్క్‌ఫోర్స్ ఇన్ఛార్జ్ కృష్ణబాబు స్పష్టం చేశారు. అధికారులను అక్కడికి పంపి వారికి భోజన వసతులు కల్పిస్తున్నామన్నారు.
రోనా టాస్క్‌ఫోర్స్ ఇంఛార్జ్ కృష్ణబాబు