ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ శివార్లలో జలపాతాల సవ్వడి - vijayawada latest news

విజయవాడ శివార్లలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కొత్త శోభను సంతరించుని సందడి చేస్తున్నాయి. ఓ యువ బృందం... ఈ జలపాతాల ఆనుపానులను గుర్తించింది.

waterfalls
waterfalls

By

Published : Oct 12, 2020, 9:09 PM IST

విజయవాడ శివార్లలో జలపాతాల సవ్వడి

మబ్బులు మురిపెంగా జార్చిన చినుకు పోగులను కలుపుకొని చిలిపిదనంతో పరిగెత్తే జలపాతాలు అంటే మైమరచిపోని వారెవరు. విజయవాడ శివారులోని కొండపల్లి కోటకు వెళ్లే మార్గంలో జలపాతాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. విజయవాడ నగర శివారులో ఇలాంటి జలపాతాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. సాహస కృత్యాలకు అలవాటుపడిన ఓ యువ బృందం... ఈ జలపాతాల ఆనుపానులను గుర్తించింది.

ఏటా భారీ వర్షాలు పడిన సమయంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి రమణీయతకు చిరునామాగా ఈ జలపాతాలు నిలుస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇవి కొత్త సొగసుతో మెరిసిపోతున్నయి. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పర్యాటక ప్రాంతాల వైపు కన్నెత్తి చూడని వారంతా ఇప్పుడు నిబంధనల సడలింపుతో ప్రకృతి ఒడిలో పరవశిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details