పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీకి నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నుంచి లక్షా 52 వేల 318 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు.. జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో 15 వేల 368 క్యూసెక్కులు.. కృష్ణా డెల్టా తూర్పు, పశ్చిమ కాలువలకు వెళుతుండగా.. మిగిలిన లక్షా 36 వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నాయి. ప్రస్తుతం బ్యారేజీ క్రస్ట్ లెవల్ స్థాయిని మించి ప్రవాహం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి.. కొన్ని రోజుల నుంచి నిత్యం సగటున 30 వేల క్యూసెక్కుల వరకూ నీటిని దిగువకు వదులుతున్నారు.
Prakasam barrage: ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీరు విడుదల - ప్రకాశం బ్యారేజీ వార్తలు
పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో.. ప్రకాశం బ్యారేజీకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నుంచి లక్షా 52 వేల 318 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీరు విడుదల