భారీ వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు పెద్దఎత్తున చేరుకుంటోంది. ఇప్పటివరకు 20 గేట్ల ద్వారా 14 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేశారు. పాలేరు, కీసర, మున్నేరు, వైరా, కట్లేరు ప్రాంతాల నుంచి వరదనీరు బ్యారేజీకి చేరుకుంటోంది. ఈరోజు సాయంత్రానికి 30 వేల క్యూసెక్కులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయాలని కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు.
ప్రకాశం బ్యారేజీ నుంచి 14వేల క్యూసెక్కుల నీరు విడుదల - విజయవాడ ప్రకాశం బ్యారేజీ వార్తలు
భారీ వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు పెద్దఎత్తున చేరుకుంటోంది. 20 గేట్ల ద్వారా 14 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈరోజు సాయంత్రానికి 30 వేల క్యూసెక్కులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ