రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయాలన్నీ నిండుకుండను తలపించాయి. అయితే, ప్రాజెక్టులకు భారీగా వచ్చి చేరిన వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఇన్‌ఫ్లో 62,189 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 52,500 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్ 70 గేట్లు అడుగు మేర ఎత్తి.. కృష్ణా తూర్పు, పశ్చిమ కాల్వలకు 9 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
సాగర్‌కు తగ్గుతున్న వరద
నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. 4 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి.. నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం590 అడుగులు కాగా.. ప్రస్తుతం 588.2 అడుగుల వద్ద ఉంది. జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 306.69 టీఎంసీలుగా ఉంది.
కొనసాగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం నుంచి 4గేట్లు ఎత్తి 10 అడుగుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 4 గేట్లు ఎత్తి 10 అడుగుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 884.40 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 212.4385 టీఎంసీలకు చేరింది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో.. విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.
జూరాలకు తగ్గుతున్న ప్రవాహం
జూరాల జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో లక్షా 86 వేల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 317.72 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 8.06 టీఎంసీలుగా ఉంది. జూరాల నుంచి దిగువకు లక్షా 87 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Sajjala: ప్రభుత్వమే పొమ్మంటోంది.. అమరరాజా బ్యాటరీస్‌పై సజ్జల వ్యాఖ్య