శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జలాశయానికి 2 లక్షలా 35వేల 387 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. లక్షా 76 వేలా 19 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.
జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 884.50 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 212.91 టీఎంసీలకు చేరింది.
ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద
ప్రకాశం బ్యారేజీ (Prakasam barrage)కి వరద నీటి రాక తగ్గింది. బ్యారెజ్ ఇన్ఫ్లో 2,77,842 క్యూసెక్కులు కాగా.. దిగువకు 9,689 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 65 గేట్లు 6 అడుగుల మేర, ఐదు గేట్లు 7 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
విద్యుత్ ఉత్పత్తి కోసం 8వేల క్యూసెక్కులు