అమూల్యమైన అమ్మ ప్రేమను బొమ్మల రూపంలో చూపించే ప్రయత్నం చేస్తోంది తెలంగాణలోని వరంగల్ మహానగర పాలక సంస్థ. నగర సుందరీకరణలో భాగంగా పలు చోట్ల తల్లీబిడ్డల విగ్రహాలను ఏర్పాటు చేస్తోంది.
బొమ్మ రూపంలో అమ్మ ప్రేమ.. అంతటా అనురాగమే - mother and daughter idols in warangal news
అమ్మ ప్రేమను అక్షరాల్లో బంధించాలంటే..ఎన్ని భాషల సాయమడిగినా అవన్నీ నిస్సహాయంగా చేతులెత్తేస్తాయి. పోనీ పాట రూపంలో ఆలపించాలంటే.. ఆమె అందించే అనురాగం ముందు ఏ రాగమైనా చిన్నబోతుంది.
![బొమ్మ రూపంలో అమ్మ ప్రేమ.. అంతటా అనురాగమే బొమ్మ రూపంలో అమ్మ ప్రేమ.. అంతటా అనురాగమే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9131629-410-9131629-1602387176458.jpg)
బొమ్మ రూపంలో అమ్మ ప్రేమ.. అంతటా అనురాగమే
మున్సిపల్ కార్యాలయంలోని వనితా వనంలో తల్లీబిడ్డల విగ్రహం, హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రవేశద్వారం ముందు రామప్ప శిల్ప శైలిని తలపించే నిలువెత్తు విగ్రహం ఎంతో ఆకట్టుకుంటున్నాయి.