ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VUndavalli Arun kumar on PRC issue: ప్రభుత్వం, ఉద్యోగులు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలి: ఉండవల్లి - ap latest news

Vundavalli Arun kumar on PRC issue: పీఆర్సీ విషయంలో ఉద్యోగుల చేస్తున్న ఆందోళనపై.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పందించారు. ప్రభుత్వం, ఉద్యోగులు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. కరోనా పరిస్థితులు, ఆర్థిక దుస్థితి దృష్ట్యా.. సమ్మె ఆపాలని ఉద్యోగులను కోరారు.

Vundavalli Arun kumar comments on PRC issue
ప్రభుత్వం, ఉద్యోగులు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలి: ఉండవల్లి

By

Published : Jan 24, 2022, 3:17 PM IST

Vundavalli Arun kumar on PRC issue: రాష్ట్రంలో పీఆర్సీ అంశం.. ఉద్యోగుల ఆందోళనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పందించారు. ఇప్పటివరకు జీతాలు పెంచాలని సమ్మెలు చూశామని.. కానీ పెంచిన జీతాలు వద్దంటూ సమ్మె నోటీసుకు సిద్ధమవడం ఇదే ప్రథమమని అన్నారు. పాత జీతాలే చాలంటూ సమ్మె చేయడం ఎప్పుడూ చూడలేదన్నారు. కరోనా పరిస్థితులు, ఆర్థిక దుస్థితి దృష్ట్యా.. సమ్మె ఆపాలని ఉద్యోగులను ఉండవల్లి కోరారు. ప్రభుత్వం, ఉద్యోగులు.. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details