ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

vro's protest: మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు నిరసిస్తూ వీఆర్వోల ఆందోళన.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ - vro's protests latest news

vro's protests on minister appalaraju comments: శ్రీకాకుళం జిల్లా పలాసలో వీఆర్వోలను అవమానపరుస్తూ.. మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై.. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలు ఆందోళనలు చేపట్టారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

vro's protests on minister appalaraju comments
మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై వీఆర్వోల ధర్నా

By

Published : Dec 2, 2021, 12:09 PM IST

Updated : Dec 2, 2021, 1:55 PM IST

vro's protests on minister appalaraju comments: శ్రీకాకుళం జిల్లా పలాసలో వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు, పలాస మున్సిపల్‌ కమిషనర్‌ రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలపై.. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలు అందోళనకు దిగారు. పలుచోట్ల ధర్నాలు చేపట్టారు. ఓటీఎస్​ అమలు కోసం నిరంతరం కష్టపడుతున్నా.. కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అప్పలరాజు, పురపాలక కమిషనర్ రాజగోపాల్.. వీఆర్వోలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

demand for sorry..

కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దారు కార్యాలయం ముందు.. వీఆర్వోలు నిరసన ప్రదర్శన చేశారు. మంత్రి అప్పలరాజు వీఆర్వోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నల్ల బ్యాడ్జీలతోనే విధులకు హాజరవుతామని వారు స్పష్టం చేశారు.

ప్రజలను తరిమి కొట్టేందుకే అప్పలరాజును గెలిపించామా..

vros association fire on minister appalaraju: మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై.. ఏపీ వీఆర్వోల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను అవమానించేలా మాట్లాడిన మంత్రి క్షమాపణలు చెప్పాలని.. వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు డిమాండ్ చేశారు. ప్రజలను తరిమి కొట్టేందుకే అప్పలరాజును.. ఎమ్మెల్యేగా, మంత్రిగా గెలిపించామా అంటూ.. వీఆర్వోల సంఘం మండిపడింది. దీనిపై తక్షణమే క్షమాపణలు చెప్పకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని స్పష్టం చేసింది. దీనికి నిరసనగా వీఆర్వోలు నల్లబాడ్జీలతో విధులు నిర్వహిస్తారని వెల్లడించింది. ముఖ్యమంత్రి స్పందించి ఇలాంటి మంత్రి, అధికారులపై చర్యలు తీసుకోవాలని వీఆర్వోల సంఘం డిమాండ్ చేసింది.

సంబంధిత కథనం:

minister appalraju fires on vro's: వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు ఫైర్.. వారి సేవలు అవసరం లేదంటూ ఆగ్రహం

Last Updated : Dec 2, 2021, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details