ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్ల ఆగ్రహజ్వాలలు - సార్వత్రిక ఎన్నికలు

అసలే ఎండలు మండిపోతున్నాయి... ఉదయాన్నే చల్లని వాతావరణంలో ఓటేసి ఇంటికెళ్దామనుకున్న వారికి చుక్కెదురైంది. ఈవీఎంలు పని చేయక ఎండలోనే ఉండాల్సి వచ్చింది. కనీసం తాగునీరు, నీడ కోసం చలువ పందిళ్లు, కుర్చీలున్నాయా అంటే అవీ కరవే. ఇది విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల పరిస్థితి.

పశ్చిమనియోజరవర్గంలో ఓటర్లు అదికారులపై మండిపడ్డారు.

By

Published : Apr 11, 2019, 1:02 PM IST

పశ్చిమనియోజరవర్గంలో ఓటర్లు అదికారులపై మండిపడ్డారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్లు ఆగ్రహజ్వాలలు ఆకాశాన్నంటాయి. ఈవీఎంలు పని చేయక నానా అవస్థలకు గురవుతున్నామంటూ ప్రజలు కోపోద్రిక్తులయ్యారు. పోలింగ్ బూత్​ల వద్ద కనీస ఏర్పాట్లు చేయలేదని వృద్ధులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, చలవపందిళ్లు, కుర్చీలు వంటివి ఏర్పాట్లు చేయటంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కన్నెర్రజేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details